తాగునీటికే ప్రాధాన్యం
- ఆ తర్వాత సాగునీటికి ఆలోచన చేస్తాం
- ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధ్దంగా ఉంది
- రాష్ట్రంలో కరువు తీవ్రతకు.. గత ప్రభుత్వ వైఫల్యాలతో పాటు ఎల్ నినో ప్రభావం కూడా ఉంది
- రాష్ట్రంలో 44 వేల చెరువులకు గాను.. కేవలం 40% చెరువుల్లోనే కొంతమేర నీరు
- రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
- అసెంబ్లీలో ఎల్ నినోపై స్వల్ఫకాలిక చర్చలో మాట్లాడిన మంత్రి
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): రాష్ట్రంలో కరువు తీవ్రతకు పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనా(BRS Governance) వైఫల్యాలతోపాటు ఎల్ నినో ప్రభావం(Impact of El Nino) కారణమని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(Uttam Kumar Reddy) అన్నారు. ఈ సమయంలో రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోందని, అన్నదాతలను(farmers) ఒంటరిగా వదల మని మంత్రి తెలిపారు. తాగునీటికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని, ఆ తర్వాత సాగునీటి విషయంలో నిర్ణయాలుంటాయని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టంచేశారు.
ఎల్ నీనోపై శుక్రవారం అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చ లో మంత్రి మాట్లాడారు. ‘ఎల్ నినో తీవ్రతపై ముందుగానే రైతులకు అవగాహన కల్పించాం. వర్షపాతం తగ్గే అవకాశం, సాగునీటి(Irrigation water) కొరతపై అన్నదాతలను అప్రమత్తం చేశాం. రైతులు నష్టపోకుండా పంటల ఎంపికపై ముందస్తు సూచనలు ఇచ్చాం. ఆయకట్టు వారీగా నీటి లభ్యతపై ఖచ్చితమైన సమాచారం అందిస్తున్నాం. ప్రతి మంగళవారం రైతు నేస్తం ద్వారా జలాశయాల పరిస్థితిని వివరిస్తున్నాం. నీరు సరిపోని చోట పంటలు వేయ మని చెప్పడం బాధ్యతారాహిత్యం.
ప్రజల తాగునీటికే ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుంది. తాగునీటి అవసరాలు తీర్చిన తరువాతే మిగులు జలాలను సాగుకు విడుదల చేస్తాం. వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే నీటి నిల్వలను పరిరక్షిస్తున్నాం. ప్రతి ప్రాజెక్టుకు ప్రత్యేక నీటి బడ్జెట్ అమలు చేస్తున్నాం’ అని తెలిపారు. బీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ.. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల(Nagarjuna Sagar Project) నుంచి మనమే ఎక్కువ నీటిని తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. ఎల్ నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని జలాశయాల నిల్వలు, కొత్త ప్రవాహాలను పది రోజులకోసారి సమీక్షిస్తున్నట్లు తెలిపారు.
‘శ్రీశైలంలో వినియోగానికి యోగ్య మైన నీరు గత ఏడాది 153.56 టీఎంసీలు.. ప్రస్తుతం 61.65 టీఎంసీలే ఉన్నాయి. నాగార్జునసాగర్‌లో గత సంవత్సరం 174.25 టీఎంసీలు.. ఈసారి 44.89 టీఎంసీలే అందుబాలో ఉన్నాయి. జలశయాల్లో కనిపించే మొత్తం నీరు సాగుకు అందుబాటులో ఉన్నట్లు కాదు. రాష్ట్రంలోని 44,034 చెరువుల్లో 40 శాతం పావు సామర్థ్యం కన్నా తక్కువగా నిండాయి. వాస్తవాలను దాచకుండా నీటి పరిస్థితిని ప్రజల ముం దు ఉంచుతున్నాం’ అని ఉత్తమ్ తెలిపారు.
కృష్ణా, గోదావరి జలాల్లో ఒక్క చుక్కనూ వదులుకోం..
కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటాను సాధించి తీరుతామని మంత్రి తెలిపారు. కృష్ణా జలాల కోసం ట్రిబ్యునల్, కేఆ ర్‌ఎంబీ, కేంద్రం వద్ద బలంగా వాదిస్తున్నామని, పొరుగు రాష్ట్రానికి నీరు వదిలేస్తున్నా మన్న ప్రచారం నిరాధారమన్నారు. ‘కృష్ణా జలాల్లో 66:34 తాత్కాలిక నిష్పత్తిని శాశ్వత హక్కుగా అంగీకరించలేదు. కృష్ణా జలాల్లో 50:50 పంపిణీ కోసం తెలంగాణ పట్టుబట్టింది. పాలమూరు--రంగారెడ్డి పథకం 90 శాతం పూర్తయిందన్న బీఆర్‌ఎస్ ప్రచారం అవాస్తవం.
కేవలం పంప్‌హౌస్‌లను నిర్మిస్తే ఎత్తిపోతల పథకం పూర్తయినట్లు కాదు. పా లమూరు- కాలువలు, పంపిణీ వ్యవస్థ, భూసేకరణ, పునరావాస పనులు అసంపూర్తిగా ఉన్నాయి. చట్టబద్ధ అనుమతులు, మిగిలిన నిర్మాణాలు పూర్తిచేసి పాల మూరుఊ వినియోగంలోకి తె స్తాం. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ ప్రాధాన్య క్ర మంలో పూర్తిచేస్తాం. కాలువల మరమ్మతులు, పంపింగ్ వ్యవస్థల పునరుద్ధరణను వేగవంతం చేస్తున్నాం. అందుబాటులో ఉ న్న ప్రతి నీటి చుక్కను సమర్థంగా వినియోగిస్తాం.
నిలిచిన పంటల రక్షణతోపాటు యా సంగి అవసరాలకు ప్రణాళిక సిద్ధం చేస్తు న్నాం. ఎల్ నినోను ఆపలేకపోయినా దాని ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం సిద్ధం గా ఉంది. రైతుల పంటలు, ప్రజల తాగునీరు, రాష్ట్ర జలహక్కుల పరిరక్షణే మా లక్ష్యం’ అని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పే ర్కొన్నారు. సీతారామ-, నాగార్జునసాగర్ లింక్ కెనాల్‌ను పరిశీలిస్తామని.. భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్‌సాగర్‌పైన ప్రత్యేక దృష్టి పెడతామని మంత్రి చెప్పారు.
తుమ్మిడిహెట్టిపై కేంద్రాన్ని బీజేపీ నేతలు కదిలించాలి..
బీఆర్‌ఎస్ పాలనలో సాగునీటి రంగం భ్రష్టుపట్టిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. మహారాష్ట్రతో అంగీకారం సాధించే బాధ్యత కేంద్రానిదేనని మంత్రి తెలిపారు. తుమ్మిడిహెట్టి ఉత్తర తెలంగాణ రై తాంగ జల స్వప్నమన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాణహిత--చేవెళ్లను వదిలేసి చారిత్రక తప్పిదం చేసిందని మంత్రి మండిపడ్డారు. రూ.2 వేల కోట్ల పనుల తర్వాత ప్రా జెక్టును మేడిగడ్డకు మార్చారని తెలిపారు. రీ-ఇంజినీరింగ్‌తో కాళేశ్వరం గుండెకాయను కూల్చేశారని, రూ.38 వేల కోట్ల పథకాన్ని లక్ష కోట్ల అప్పుగా మార్చారని మండిపడ్డారు.
‘కాళేశ్వరం రుణాలకు ఏటా రూ.1,5-16 వేల కోట్లు చెల్లిస్తున్నాం. మేడిగడ్డ కుంగడం డిజైన్, నిర్మాణ వైఫల్యానికి నిదర్శనం. మేడిగడ్డ-,అన్నారం, -సుందిళ్ల పరస్పర ఆధారిత వ్యవస్థ. బ్యారేజీల్లో నీరు నిల్వ చేయకుండా పంపింగ్ సాధ్యం కాదు. కాళేశ్వరం సమస్య చిన్న మరమ్మతుతో పరిష్కారమయ్యేది కాదు. ఎన్డీఎస్‌ఏ, సీడబ్ల్యూసీ సూచనలతోనే పునరుద్ధరణ. ఐఐటీ బాంబే-ఏఎఫ్‌ఆర్‌వై ఆధ్వర్యంలో పునరుద్ధరణ డిజైను. కాళేశ్వరం ప్రజల సొత్తు.. రాజకీయ కక్షకు తావులేదు.
ప్రాజెక్టు భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. ప్రజల ప్రాణభద్రతను పణంగా పెట్టి కాళేశ్వరం బ్యారేజీలను వినియోగించలేం. చిన్న మరమ్మతుతోనే కాళేశ్వరాన్ని నడపవచ్చన్న బీఆర్‌ఎస్ వాదన సాంకేతికంగా తప్పు. ఎన్డీఎస్‌ఏ, సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారమే బ్యారేజీల పునరుద్ధరణ చేపడతాం. కాళేశ్వరం ప్రాజెక్టులో సురక్షితంగా ఉన్న లింక్-2 ద్వారా పంపింగ్ కొనసాగిస్తు న్నాం’ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.