CJP నిరసనలో విషాదం.. గుండెపోటుతో వ్యక్తి మృతి!

03-10-2026 | 10:32am

ముంబై(Mumbai)లోని శివాజీ పార్క్‌లో జరిగిన CJP నిరసన(Protest)లో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ గ్యానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ CJP నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఈ నిరసనకు మద్దతుగా థానేలోని దోస్తి వెస్ట్ కౌంటీకి చెందిన గోపాలకృష్ణ సుబ్బయ్య పిళ్లై అక్కడికి చేరుకున్నారు.

అయితే నిరసన కార్యక్రమం వద్ద ఆయనకు ఒక్కసారిగా ఛాతీ నొప్పి(Chest Pain) రావడంతో పోలీసులు వెంటనే శుశ్రూష ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గోపాలకృష్ణ సుబ్బయ్య పిళ్లై మృతిచెందినట్లు సమాచారం. ఈ ఘటనతో నిరసన ప్రాంగణంలో విషాదం నెలకొంది.


మరిన్ని వార్తలు