బెల్లంపల్లిలో కొండచిలువ కలకలం..
01-10-2026 | 02:50pm
బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణం రైల్వే స్టేషన్ ప్రాంతంలో(Bellampalli Railway Station) కనిపించిన కొండ చిలువ సంచారం కలవరం రేపింది. కొండ చిలువ సమాచారాన్ని సమాచారం అందుకున్న అటవీ అధికారులు వెంటనే వెళ్ళి కొండచిలువను పట్టుకున్నారు. ఎఫ్ ఆర్ ఓ పూర్ణచందర్, డిప్యూటీ ఎఫ్ఆర్ఓ రాంబాబు స్నేక్ క్యాచర్ దినేష్ తో కలిసి కొండచిలువను పట్టుకొని సమీప అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఈ కొండచిలువ 10 అడుగుల పొడవు 30 కిలోల బరువు ఉంది. జనావాసాలల్లోకి కొండ చిలువ సంచరించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అటవిశాఖ అధికారులు వచ్చి కొండ చిలువ ను స్వాధీనం చేసుకోవడంతో ప్రజలు ఊపిరి పోల్చుకున్నారు.