టెక్‌బాల్ సెమీస్‌లో ఓడిన క్విన్సీ డిసౌజా

19-09-2026 | 08:49am

ఆసియా క్రీడలు 2026: నాగోయాలో ఆసియా క్రీడలు శనివారం ప్రారంభమయ్యాయి. ఆసియా క్రీడలు 2026లో భాగంగా టెక్బాల్‌లో తొలిసారిగా అడుగుపెట్టిన భారత క్రీడాకారిణి క్విమ్సీ జోక్విమ్ డిసౌజా(Quimcy Dsouza loses) శనివారం నగోయా సిటీ హిగాషి స్పోర్ట్స్ సెంటర్‌లో జరిగిన సెమీ-ఫైనల్‌లో ఇండోనేషియాకు చెందిన ఇమా సుమయా చేతిలో 1-2 తేడాతో ఓడిపోయింది. ఆమె ఇప్పుడు ఆదివారం జరిగే కాంస్య పతకం మ్యాచ్‌లో పోటీపడుతుంది. ఆ మ్యాచ్‌లో విజయం సాధిస్తే, ఆసియా క్రీడల్లో భారత్ మొట్టమొదటి టెక్బాల్ పతకాన్ని కైవసం చేసుకుంటుంది.

కాంస్య పతకం కోసం పోరు 

టెక్‌బాల్ మహిళల సింగిల్స్ విభాగం సెమీ-ఫైనల్‌లో క్విన్సీ డిసౌజా అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించినప్పటికీ, విజయం సాధించే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నారు. ఆదివారం ఉదయం జరగనున్న కాంస్య పతక పోరుకు సిద్ధమవుతుంది. కాంస్య పతకం కోసం జరిగే పోరులో క్విన్సీ, జపాన్‌కు చెందిన యుయినా సకమోటోతో తలపడనుంది.

మరిన్ని వార్తలు