ఇరిగేషన్ అధికారులపై రఘునందన్ సీరియస్

19-09-2026 | 01:56pm

రామచంద్రపురం, ఆగస్టు 19: రామచంద్రపురం మండలం  బిహెచ్‎ఈఎల్ ఎక్స్‎రోడ్(BHEL X-Road) నుండి బంధంకొమ్ము,అమీన్శపూర్ వెళ్లే రహదారి బ్రిడ్జి నిర్మాణ పనులను మెదక్ పార్లమెంట్ సభ్యులు యం.రఘునందన్ రావు  పరిశీలించారు.వినాయక్ నగర్,జ్యోతినగర్ కాలనీలల్లో బస్టాప్,డ్రైనేజీ లైన్లు,పెండింగులో ఉన్న సమస్యలపై సియంసి  కమీషనర్,అధికారులతో కలిసి  ఎంపీ రఘునందన్ పర్యటించారు.

ఈ సందర్భంగా రఘునందన్ అమీన్ పూర్‎లో ఇరిగేషన్ అధికారులపై ఫైరయ్యారు.బఫర్ జోన్,ఎఫ్.టి.ఎల్ పేరుతో రోడ్ల విస్తరణకు ఇరిగేషన్ అధికారులు అడ్డం పడుతున్నారని అన్నారు.చెరువుల్లో పెద్ద పెద్ద భవనాలు కడుతుంటే ఇరిగేషన్ అధికారులకు కనిపించదు కానీ అమీన్‎పూర్‎లో బంధంకొమ్ము చెరువు వద్ద 150ఫీట్ల రోడ్డుకు ఎందుకు అనుమతి ఇవ్వరని ప్రశ్నించారు.వారం రోజుల్లో బంధంకొమ్ము చెరువు వద్ద 150ఫీట్ల రోడ్డుకి అనుమతి ఇవ్వకపోతే ఇరిగేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమములో రామచంద్రపురం డివిజన్ అధ్యక్షులు నర్సింగ్ గౌడ్,కృష్ణ మూర్తి చారి ,ఈర్ల రాజు బిజెపి నాయకులు, స్థానికులు తాడితరులు పాల్గొన్నారు.



మరిన్ని వార్తలు