మళ్లీ వచ్చేస్తున్నాయా?

27-09-2026 | 08:39am

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు మరోసారి మారుతున్నాయి. తెలంగాణలో(Telangana rain alert today) పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజా అప్‌డేట్‌లో తెలిపింది. సెప్టెంబర్ 27న తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు(today weather), గంటకు 30–40 కి.మీ. వేగంతో ఈదురుగాలులతో కూడిన ఎల్లో అలర్ట్ ఉంది.

ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలకు అవకాశం ఉన్నట్లు తాజా హెచ్చరికలు సూచిస్తున్నాయి. హైదరాబాద్‌లోనూ ఆకాశం పాక్షికంగా మేఘావృతమై, వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని  India Meteorological Department నగర అంచనా పేర్కొంది.

అయితే సెప్టెంబర్ 27న హైదరాబాద్‌కు(Hyderabad rain alert) ప్రత్యేక హెచ్చరిక జారీ కాలేదు. ఆంధ్రప్రదేశ్‌లోనూ కొన్ని ప్రాంతాల్లో వర్షాల ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. కోస్తాంధ్రలో సెప్టెంబర్ 26–28 మధ్య అక్కడక్కడ వర్షాలు, రాయలసీమలోనూ వర్షాలు కురిసే అవకాశాన్ని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు స్థానిక వాతావరణ అప్‌డేట్స్‌ను గమనిస్తూ, ఉరుములు-మెరుపులు ఉన్న సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.


మరిన్ని వార్తలు