20 August, 2026 | 8:32 PM

గణపురంలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

20-08-2026 08:00 PM

గణపురం,(విజయక్రాంతి): మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82 వ జయంతి వేడుకలను గణపురం మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గణపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తాళ్లపల్లి భాస్కర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కోఆప్షన్ సభ్యూ ఎండి చోటెమియా, మార్కెట్ కమిటీ డైరెక్టర్  కట్కూరి శ్రీనివాస్, విడిదినేని అశోక్, ముత్యాల రాజయ్య, ఓరుగంటి కృష్ణ, పెండ్యాల వెంకటేష్, దూలం కుమార్, రామగిరి సంపత్, గుర్రం తిరుపతి, పోతర్ల అశోక్,పసునూటి శంకర్, సాంబమూర్తి,నేరెళ్ల రాజు, రాయల కొమురయ్య, ఎండి పాషా, ఎండి సైదుల్,ఎస్కే జానీ, సమీర్ తదితరులు పాల్గొన్నారు.