బెజ్జూర్ ఎస్సైగా రమేష్ బాధ్యతల స్వీకరణ
బెజ్జూర్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): కొమురం భీం అసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ పోలీస్ స్టేషన్ లో సోమవారం బెజ్జూర్ ఎస్సైగా కె. రమేష్(K. Ramesh) పదవి బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంచిర్యాల టౌన్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఆయన, తాజాగా బెజ్జూర్ కు బదిలీ అయ్యారు.
ఈ మేరకు సోమవారం అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై రమేష్ మాట్లాడుతూ, మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉంటానని, నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటానని తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఇక్కడ విధులు నిర్వహించిన ఎస్సై సర్తాజ్ పాషా ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయానికి అటచ్ కావడంతో ఆయన స్థానంలో రమేష్ నియమితులయ్యారు.