గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు అధిక ధరలకు మద్యం విక్రయాలు
మాగనూరు సెప్టెంబర్ 27: నారాయణపేట జిల్లా(Narayanpet District) మాగనూరు మండలంలోని ప్రతి గ్రామంలో మద్యం బెల్ట్ షాపులు వెలిసినవి. బెల్ట్ షాపుల ద్వారా ప్రతినిత్యం ప్రజలు మద్యం ప్రియులు ఇల్లు ఒళ్ళును గుళ్ళు చేసుకొని అధిక ధరలతో మద్యం సేవించి ఇళ్లను గుల్ల చేస్తున్నారని మండల ప్రజల ఆరోపిస్తున్నారు.
మండలంలో మొబైల్ వైన్ షాపులు సాగుతున్నాయి, మండలంలో వైన్ షాపు దక్కించుకున్న దుకాణదారుడు ఏకంగా జీపులలో మండలంలోని ప్రతి గ్రామం తిరిగి మద్యం అధిక ధరలకు సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆయా గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. మండలంలో కొన్ని గ్రామాల్లో గ్రామ అభివృద్ధి పేరుతో వేలం పాటలలో బెల్ట్ షాపులో దక్కించుకొని అధిక ధరలకు అమ్ముతున్నట్లు గ్రామస్తులు తెలిపారు .వైన్ షాప్ దుకాణదారుడు మాకు ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ ధర ఇస్తున్నారు.
కావున మేము కూడా టెండర్లు లో బెల్ట్ షాపు దక్కించుకున్నాము కావున ఒక బాటిల్ వెంబడి 20 నుంచి 30 రూపాయలు తీసుకుంటున్నామని బెల్ట్ షాపు యజమాన్యం చెబుతున్నారని మద్యం ప్రజలు అంటున్నారు. మండలంలో బెల్ట్ షాపులే కాక జాతీయ రహదారి కి ఇరువైపులా ఉన్న డాబాలలో ,గల్లీలోని చిన్నచిన్న కిరాణా దుకాణాల్లో కూడా మద్యం అధిక ధరలకు వికరిస్తున్నారని ఆయా కాలని వాసులు తెలిపారు. జాతీయ రహదారి కి ఇరువైపులా గల హోటల్లో కూడా మద్యం అమ్మడం వల్ల వాహనదారులు మద్యం సేవించి ఏప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నామని తెలిపారు. ఎక్సైజ్ అధికారులు నిద్రమత్తును వీడి స్పందించి హోటల్లో వద్ద ,కిరాణా దుకాణాల వద్ద అక్రమముగా అమ్మకాలు జరుగుతున్న మధ్యమును అకస్మాత్తుగా దాడులు నిర్వహించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.