మట్టి మాఫియా విజృంభణ
- రాత్రివేళల్లో కోహెడ, బ్రాహ్మణపల్లి సరిహద్దుల్లో భారీ దందా
- తవ్వకం ఒకచోట.. నిల్వ మరొక చోట.. తరలింపు మరో చోట
- జేసీబీలు, టిప్పర్లతో అక్రమ రవాణా.. నిద్రపోతున్న మైనింగ్, రెవెన్యూ యంత్రాంగం?
- ప్రభుత్వ రాయల్టీకి గండి.. ప్రజాప్రతినిధుల హెచ్చరికలు పెడచెవిన
ఆదిభట్ల,సెప్టెంబర్ 18(విజయ క్రాంతి): రంగారెడ్డి జిల్లా(Ranga Reddy District) ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని కోహెడ, బ్రాహ్మణపల్లి గ్రామాలు(Brahmanapalli villages) అక్రమ మట్టి దందాతో అతలాకుతలమవుతున్నాయి. సహజ వనరులను పగటిపూట విచ్చలవిడిగా తోడేస్తూ, రాత్రివేళల్లో యథేచ్ఛగా తరలిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు(Real estate dealers), వెంచర్ల నిర్వాహకుల(Venture managers)తో చేతులు కలిపిన మట్టి మాఫియా(Soil Mafia).. ఎలాంటి అనుమతులు లేకుండా కోట్లలో దందా నడిపి స్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పక్కా ప్రణాళికతో అక్రమ నిల్వలు....
సంఘీ, రాందాస్పల్లి, కోహెడ, మంగళపల్లి, రాగన్నగూడ పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ, అసైన్డ్, కొండ ప్రాంతాల నుంచి పగటిపూట భారీగా మట్టి తవ్వకాలు సాగిస్తున్నారు. అక్కడినుంచి నేరుగా తరలిస్తే దొరికిపోతామనే భయంతో, మొదట కోహెడ, బ్రాహ్మణపల్లి గ్రామాల సరిహద్దుల్లోని నిర్జన ప్రదేశాల్లో భారీగా డంపింగ్ చేస్తున్నారు. ఆ తర్వాత అర్ధరాత్రి 12 గంటల నుంచి వేకువజాము వరకు వందలాది టిప్పర్ల ద్వారా గ్రేటర్ హైదరాబాద్ సరిహద్దుల్లోని వివిధ నిర్మాణ ప్రాంతాలు, వెంచర్లకు తరలిస్తున్నారు. పగలు పచ్చగా ఉండే భూములు, రాత్రికి రాత్రే మైనింగ్ జోన్లుగా మారిపోతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనలకు తిలోదకాలు ప్రభుత్వ ఆదాయానికి గండి
మైనింగ్ నిబంధనల ప్రకారం మట్టి తవ్వకాలకు అనుమతులు (పెర్మిట్స్ ), రవాణాకు పాస్లు, రాత్రివేళల్లో రవాణాపై ఆంక్షలు ఉం టాయి. కానీ ఇక్కడ ఏ ఒక్క నిబంధనా అమ లు కావడం లేదు.
మైనింగ్ శాఖ నుంచి అనుమతి పత్రాలు లేవు....
ప్రభుత్వానికి చెల్లించాల్సిన చదరపు మీటరు రాయల్టీ రుసుమును ఎగవేస్తున్నా రు. రాత్రివేళల్లో హెవీ టిప్పర్ల రాకపోకలతో గ్రామీణ రోడ్లు పూర్తిగా ధ్వంసమైపోతున్నాయి.
ఎమ్మెల్యే ఆదేశాలూ బేఖాతరు
పలు బహిరంగ సభలు, సమీక్షా సమావేశాల్లో స్థానిక ఎమ్మెల్యే స్పందిస్తూ అవినీతి, అక్రమ మైని్ంప కఠిన చర్యలు ఉంటాయని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, కిందిస్థాయి అధికారులు మాత్రం లెక్కచేయ డం లేదనే విమర్శలు ఉన్నాయి. ఎమ్మెల్యే హెచ్చరికలను కూడా పక్కనపెట్టి మాఫియా కు కొందరు అధికారులు ముడుపుల మత్తు లో సహకరిస్తున్నారనే ప్రచారం స్థానికంగా జోరుగా సాగుతోంది.
ఉమ్మడి తనిఖీలకు డిమాండ్...
ఇప్పటికైనా మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు వెంటనే స్పందించి సంయుక్తం గా క్షేత్రస్థాయి పరిశీలన జరపాలని స్థానికు లు కోరుతున్నారు. కోహెడ, బ్రాహ్మణపల్లి పరిధిలో ఉన్న మట్టి కుప్పల ఆధారంగా వి చారణ చేపట్టి, వాహనాలను సీజ్ చేసి అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చే యాలని, ప్రభుత్వ ఆదాయానికి జరిగిన గం డిని రికవరీ చేయాలనిడిమాండ్ చేస్తున్నారు.