రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా కిరణ్ కుమార్ సంగం
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి
మణికొండ,(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా(Rangareddy District) కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా కిరణ్ కుమార్ సంగం నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి(District President Challa Narasimha Reddy) బుధవారం ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చల్లా నర్సింహారెడ్డి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నాయకత్వంలో పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మార్గదర్శకత్వంలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు.
పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు, కాంగ్రెస్ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ పార్టీ సంస్థాగత బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. నూతన బాధ్యతలు స్వీకరించిన కిరణ్ కుమార్ సంగం మాట్లాడుతూ, తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మార్గదర్శకత్వంలో పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు.