ఈ నెల 28న రేషన్ డీలర్ల సమావేశం

25-09-2026 | 06:47pm

మిడ్జిల్, సెప్టెంబర్ 25 (విజయ క్రాంతి) : జిల్లా రేషన్ డీలర్ల సంఘం(District Ration Dealers Association) సమావేశం, నూతన కార్యవర్గం ఎన్నిక ఈ నెల 28న ఉదయం 10:30 గంటలకు టీఎన్జీవో భవన్‌లో నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. దాదాపు పదేళ్ల తర్వాత నూతన కార్యవర్గాన్ని(New Executive Committee) ఎన్నుకోనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో డీలర్ల సమస్యలు(Dealers issues), హక్కులు, సంక్షేమం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలిపారు.

అన్ని మండలాల రేషన్ డీలర్ల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు. జిల్లా కన్వీనర్ ఎండి మునాఫ్‌తో(District Convener MD Munaf) పాటు అన్వార్ పాషా, మదర్ అలీ, నారాయణ, చెన్నారెడ్డి, వేముల నర్సింహులు, నాగరాజు, భీంరెడ్డి, పాలాది రమేష్, రాజు, లక్ష్మయ్య తదితరులు పాల్గొననున్నారు.

మరిన్ని వార్తలు