గొర్రెల పెంపకదారుల సంఘ భూమి అక్రమ రిజిస్ట్రేషన్.. కలెక్టర్ కు వినతి

21-09-2026 | 04:58pm

జనగామ, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): పెద్దపహాడ్ గ్రామం(Peddapahad Village)లోని శ్రీ మల్లికార్జున గొర్రెల పెంపకదారుల సంఘానికి చెందిన 4.04 ఎకరాల భూమి (సర్వే నెం. 582/F) ను ఫోర్జరీ సంతకాలతో ఉస్మానియా అగ్రో ఇండస్ట్రీస్(Osmania Agro Industries) అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుందని సంఘ సభ్యులు ఆరోపించారు. తమ సంఘం 08/06/2005న డాక్యుమెంట్ నెం. 5556/2005 ద్వారా కొనుగోలు చేయగా, తమకు తెలియకుండా 02/01/2007న డాక్యుమెంట్ నెం. 11/2007 గా అక్రమ రిజిస్ట్రేషన్ చేశారని తెలిపారు. అధికారులు విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతూ సోమవారం కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యాదవ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు