29 August, 2026 | 2:14 AM

ఓటర్ జాబితాపై సవరణ

29-08-2026 12:00 AM

తాడ్వాయి,ఆగష్టు,28( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని కృష్ణాజివాడి గ్రామంలో శుక్రవారం ఓటర్ జాబితా పై సవరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్ లిస్టులో తప్పుగా నమోదైన ఓటర్లకు నోటీసులు అందించారు.

18 సంవత్సరాలు నిండే ఓటర్లు సైతం ఓటర్ నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తహసిల్దార్ శ్వేత తెలిపారు. ఓటర్ లిస్టులో గల్లంతైన వారు సైతం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏమైనా తప్పులు ఉన్నట్లయితే వాటిని సరిచేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో జిపిఓ, అధికారులు పాల్గొన్నారు.