ఆక్రమణకు గురువుతున్న రోడ్డు కాపాడండి సారు

10-09-2026 | 06:44pm

బెల,(విజయక్రాంతి): బేల లోని శివాజీ చౌక్ నుంచి అశోక్‌నగర్ మీదుగా భవానీగూడ వైపు వెళ్లే 'పానాది' (రోడ్డు) ఆక్రమణకు గురవుతోందని అశోక్ నగర్ కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ​ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి, ఆక్రమణల నుండి కాపాడాలని కోరుతూ కాలనీ వాసులు గురువారం తహసీల్దార్ ప్రవీణ్ కుమార్‌(Tehsildar Praveen Kumar)కు వినతిపత్రం అందజేశారు. ​గతంలో కూడా ఈ స్థలం ఆక్రమణకు గురికాగా, నాటి గ్రామ సర్పంచ్ ఆ నిర్మాణాన్ని తొలగించినట్లు తెలిపారు. ​అయితే, ప్రస్తుతం మరోసారి ఆ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

మరిన్ని వార్తలు