మిద్దె తోటలు.. పర్యావరణానికి మేలు

13-09-2026 | 05:05am
  1. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో 700 మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
  2. సీటీజీ ఆధ్వర్యంలో నిర్వహణ

హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): నగరాల్లో పచ్చదనాన్ని(Greenery) పెంపొందించడం, ప్రతి ఇంటినీ ఒక చిన్న అర్బన్ ఫామ్ గా మార్చడం, పర్యావరణ పరిరక్షణ(Environmental Protection)పై ప్రజ ల్లో అవగాహన కల్పించడం లక్ష్యంగా సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్(City of Terrace Gardens) (సీటీజీ) ఆధ్వర్యంలో శనివారం నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌(Nampally Public Gardens)లో ప్రత్యేక పర్యావరణ కార్యక్రమం నిర్వహించారు. సీటీజీ ఫౌండర్, సీనియర్ న్యాయవాది హర్కర శ్రీనివాస్(CTG Founder and Senior Advocate Harkara Srinivas) అధ్యక్షత వహించి ఇంటింటికి ఇంకుడు గుంట అంశాన్ని ప్రజల్లోకి బలంగా వెళ్లేలా చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో 700 మట్టి వినాయక విగ్రహాలను(Clay Ganesha idols) ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. వివిధ రకాల కూరగాయ మొక్కలు(Vegetable plants), పూల మొక్కలు, సుగంధ, ఉపయోగకరమై న మొక్కలను సీటీజీ సభ్యులకు అందజేశారు. అడీఎంఎన్ సరోజ ప్రతి ఇంటా మిద్దె తోట ఇంటింటా ఇంకుడు గుంత నగర జీవన విధానంలో పచ్చదనం, స్వచ్ఛమైన ఆహారం, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణను ఒకే ప్రజా ఉద్యమంగా తీసుకెళ్లాలన్న సంకల్పాన్ని వివరిం చారు. ముఖ్య అతిథి డా. రాజిరెడ్డి.. నగరాల్లో మిద్దె తోట అవసరాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

కాంక్రీట్ నగరాల్లో కూడా ప్రతి ఇంటి మిద్దెను, బాల్కనీని, అందుబాటులో ఉన్న చిన్న స్థలాన్ని పచ్చని ఉత్పాదక ప్రదేశంగా మార్చుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. అర్బన్ ఫార్మింగ్ను విస్తృతంగా ప్రో త్సహించేందుకు హార్టికల్చర్ యూనివర్సిటీ తరఫున అవసరమైన సాంకేతిక సహాయం మరియు సహకారం అందిస్తామని డా. రా జి రెడ్డి హామీ ఇచ్చారు. హెచ్‌ఎండీఏ మేనేజర్ వీజీ సుందర్ హెచ్‌ఎండీఏ ద్వారా చేప డుతున్న వివిధ పచ్చదనం, పట్టణ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను వివరించారు.

సీటీజీ సభ్యుల మిద్దె తోటల కార్యక్రమాన్ని అభినందించిన ఆయన.. ఈ కార్యక్రమానికి అవసరమైన మొక్కల సహకారం అందించడంలో హెచ్‌ఎండీఏ తరఫున తన వంతు సహకారం కొనసాగిస్తానని తెలిపారు. రసాయన రంగులతో తయారు చేసిన ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా సహజ మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను వినియోగించాల్సిన అవసరాన్ని సీటీజీ ప్రతినిధులు వివరించారు. సీటీజీ ప్రతినిధులు మాట్లాడుతూ, నగరాల్లో పర్యావరణ పరిరక్షణను కేవలం ప్రభుత్వ బాధ్యతగా కాకుండా ప్రతి కుటుంబం యొక్క రోజువారీ జీవన విధానంలో భాగంగా మార్చ డమే తమ లక్ష్యమని తెలిపారు.

మరిన్ని వార్తలు