సిపిఐ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం
గిరిజన యువతీ శిరీష హత్యోదంపై కార్యాచరణ
సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా
కొత్తగూడెం టౌన్, (విజయక్రాంతి): ములకలపల్లి మండలం, కౌటిగూడెం(Kautigudem) గ్రామానికి చెందిన గిరిజన యువతీ హత్యా, అత్యాచారం ఘటనపై రాజకీయ, ప్రజా, సామాజిక సంఘాల ఆధ్వర్యంలో సిపిఐ జిల్లా కార్యాలయం 'శేషగిరిభవన్'లో రౌండ్ టేబుల్ సమావేశం(Round table meeting) నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా తెలిపారు.
ఆదివారం అయన మాట్లాడుతూ.. ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేస్తూ కుటుంబానికి అండగా నిలుస్తున్న ఆదివాసీ బిడ్డను అత్యంత కిరాతకంగా హతమార్చడం హేయమైన చర్య అని, మానవ సమాజానికే మచ్చ అని, ఇలాంటి దారుణాలపై ప్రతిఒక్కరు స్పందించాలన్నారు. రౌండ్ టేబుల్(Round table meeting) సమావేశంలో కార్యాచరణ రూపొందించి బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేవరకు ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు. రాజకీయపక్షాలు, ప్రజా, సామాజిక సంఘాలు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సాబీర్ పాషా కోరారు.






