7 September, 2026 | 11:01 AM

ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న మైనంపల్లి హనుమంతరావు

07-09-2026 | 09:42am

మల్కాజిగిరి, సెప్టెంబర్ 6,(విజయ క్రాంతి): మల్కాజిగిరి శ్రీ ఆత్మలింగ మహాగణపతి(Atmalinga Mahaganapati) ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజా కార్యక్రమానికి మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు(Mynampally Hanumantha Rao) హజరై,  స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.

ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు తన వంతు సహాయ సహాకారం అందజేస్తానని హమీనిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు దేశం యాదగిరి గౌడ్, గుజ్జుక వెంకటేష్,బోడికే మనో హర్,ఎస్ వి కృష్ణారెడ్డి, గోపాల్, శ్రీనివాస్,ఎన్ వి రమణ, స్థానిక కాంగ్రెస్ నాయకులు వెంకటేష్ గౌడ్,బి కే శ్రీనివాస్, జీడి సంపత్ గౌడ్,గుండా నిరం జన్, జి ఎన్ వి సతీష్ కుమార్, కొత్తపల్లి ఉపేందర్ రెడ్డి, వినోద్ యాదవ్, సంతోష్ రామ్ దాస్, పార్థ సారధి,భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు