గ్రామీణ వైద్యులారా అధైర్య పడకండి

27-09-2026 | 08:11pm
  1. ఆర్ఎంపీలు ప్రాథమిక వైద్యం మాత్రమే చేయాలి
  2. ముదిగొండ మండల నూతన కమిటీ ఎన్నిక
  3. గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిట్టల

ఖమ్మం సెప్టెంబర్27 హెల్త్ (విజయక్రాంతి): నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రాథమిక వైద్య సేవలు(Primary medical services) అందిస్తున్న గ్రామీణ వైద్యులారా అదైర్య పడకండి గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం(Rural Doctors' Welfare Association) అండగా ఉంటుందని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు పిట్టల నాగేశ్వరరావు గ్రామీణ వైద్యులకు భరోసానిచ్చారు. ఆదివారం ఖమ్మం పట్టణంలోని గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో జిల్లా జనరల్ బాడీ సమావేశం జిల్లా అధ్యక్షులు పిట్టల నాగేశ్వరరావు అధ్యక్షతన  జరిగింది.

ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ వైద్యులు పరిధికి మించి వైద్యం చేయొద్దని  కేవలం ప్రాథమిక వైద్యం మాత్రమే చేయాలని సూచించారు.జిల్లాలో ఎక్కడైనా పరిధికి మించి వైద్యం చేసే వారిని గుర్తించి వారి పద్ధతి మార్చుకోవాలని లేనిపక్షంలో అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఎవరికైనా తీవ్రమైన అనారోగ్యం కలిగితే వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి(Government Hospital) గాని లేదా ప్రైవేట్ ఆస్పత్రికి(Private hospital) గాని తరలించాలని సూచించారు.

 ముదిగొండ మండల కమిటీ ఎన్నిక

గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ముదిగొండ మండల అధ్యక్షుడిగా ఎన్ నరసింహారావు,గౌరవ అధ్యక్షలు వర్ధన్ రాజు,ప్రధాన కార్యదర్శి పి మోహనరావు, ఉపాధ్యక్షులు నాగేశ్వరావు, ఖలీల్,ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజేశేఖర్,కోశశాధికారి భద్రాచలం, జిల్లా కూటివ్ ఉపేందర్,సహాయ కార్య దర్శి భాస్కర్ లను మండల సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతారపు వెంకటాచారి, జిల్లా ఉపాధ్యక్షులు నారపోగు సుదర్శన్,నాయకులు పెద్ద భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు