6 September, 2026 | 9:50 AM

యువ డాక్టర్లకు అండగా సచిన్

06-09-2026 | 05:25am
  1. తండ్రి పేరిట ఫెలోషిప్ ప్రకటన
  2. ఏడాదికో వైద్య విద్యార్థికి ఆర్థిక సాయం
  3. టీచర్స్‌డే సందర్భంగా కీలక నిర్ణయం

ముంబై, సెప్టెంబర్ 5: భారత్ క్రికెట్ దిగ్గ జం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం (Teachers' Day) సంద ర్భంగా యువ డాక్టర్లకు అండగా నిలిచేందు కు ముందుకొచ్చారు. తన తండ్రి, దివంగత ప్రొఫెసర్ రమేష్ టెండూల్కర్ జ్ఞాపకార్థం ప్రొఫెసర్ రమేష్ టెండూల్కర్ మెమోరియ ల్ ఫెలోషిప్‌ను ప్రారంభించారు. దీని ద్వారా వైద్య రంగంలో పైచదువులు చదవాలనుకునే యువ వైద్యులకు సచిన్ ఆర్థిక సహా యం అందించనున్నారు.

సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్, హెల్త్‌కేర్ సంస్థ అయిన ఇం గా హెల్త్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో దీనిని నిర్వహిస్తోంది. ప్రతి సంవత్సరం ఒక ఎండీ చేసిన యువ డాక్టర్‌కు ఈ ఫెలోషిప్ కింద ఆర్థిక సాయం లభిస్తుంది. ఎంపికైన వైద్యుడికి శ్రీనగర్‌లో క్లెఫ్ట్ అండ్ క్రానియోఫేషియ ల్ విభాగంలో ఏడాది పాటు ప్రత్యేక శిక్షణ పొందే అవకాశం కల్పిస్తారు. ఈ ప్రోగ్రామ్ విజయవంతంగా పూర్తి చేసిన వారికి ‘సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్’ నుంచి సర్టిఫికేట్ అందజేస్తారు.

ఇది కేవలం ఒక ఫెలోషిప్ మాత్రమే కాదనీ, విద్య అవకాశాలను సృష్టిస్తుందని, ఆ అవకాశం ఇతరులకు సేవ చేయడానికి ఉపయోగపడినప్పుడే దానికి నిజమైన అర్థం ఉంటుందని నాన్న బలంగా నమ్మేవారని సచిన్ చెప్పుకొచ్చారు. ఆయన ఆలోచనలను ముందుకు తీసుకెళ్లేందుకే ఈ ప్రయత్నమని తెలిపారు. ఈ సదుపాయం ద్వారా క్లిష్టమైన వైద్య విభాగాలలో యువ డాక్టర్లను ప్రోత్సహించడంతో పాటు, గ్రామీ ణ, వెనుకబడిన ప్రాంతాలలోని పిల్లలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని సచి న్ ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు