ప్రశ్నార్ధకంగా పారిశుద్ధ్యం?

19-09-2026 | 05:25am

* మురికికూపంగా రాజేంద్రనగర్ ఫిబిల్ సిటీ రోడ్డు

* ఏళ్ల తరబడి మరమ్మతు కు నోచుకొని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ

* ముక్కు మూసుకుని ప్రయాణిస్తున్న జనం

* పట్టించుకోని జీహెచ్‌ఎంసీ అధికారులు

రాజేంద్రనగర్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): సమస్య చిన్నదే అయినప్పటికీ, జీహెచ్‌ఎంసీ రాజేంద్రనగర్ సర్కిల్(GHMC Rajendranagar Circle) పారిశుధ్య అధికారుల నిర్లక్ష్యం మాత్రం కొండంతగా కనిపిస్తోంది. ఏళ్ల తరబడి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ(Underground drainage system)కు మరమ్మతులు చేయకపోవడంతో ఫీబిల్ సిటీ రోడ్డంతా(Feeble City Road) మరుగుదొడ్ల కలుషిత నీటితో నిండిపోయి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది.స్నేహిత హిల్స్ లోని వ్యాలీ ఓక్ కాలేజీ ముందు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లైన్లు పూర్తిగా పూడిపోవడంతో స్థానిక అపార్ట్మెంట్ల నుంచి వచ్చే మురుగునీరంతా ఒక్కసారిగా రోడ్డుపైకి ప్రవహిస్తోంది.

దీంతో ఫీబిల్ సిటీ ప్రధాన రహదారి కాస్తా మురికికూపంగా మారింది. ప్రతిరోజు వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ రహదారిపై నిరంతరం డ్రైనేజీ నీరు నిలవడంతో రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా తయారైంది.ముక్కు మూసుకుని ప్రయాణం..ప్రతిరోజు ఉదయం పూట పెద్ద ఎత్తున మురుగునీరు, మరుగుదొడ్డి వ్యర్థా లు రోడ్లపైకి వస్తుండటంతో అటువైపు వెళ్లే వాహనదారులు, కాలినడకన వెళ్లే ప్రజలు ముక్కు మూసుకుని వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. లీక్ అవుతున్న మ్యాన్ హోల్స్ వద్ద పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది.

భవిష్యత్తులో అసలు ఈ దారిలోనే నడవలేని విధంగా వ్యర్థాలు పేరుకుపోతు న్నాయి.గత కొన్ని సంవత్సరాలుగా ఈ మ్యాన్హోల్కు శాశ్వత మరమ్మతులు చేయడంలో జీహెచ్‌ఎంసీ రాజేంద్రనగర్ సర్కిల్ సానిటేషన్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఈ నిర్లక్ష్యం కారణంగా స్థానికులు, ప్రయాణికులు తీవ్ర అంటువ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి, తక్షణమే డ్రైనేజీకి మరమ్మతులు చేపట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని స్థానికులు బలంగా డిమాండ్ చేస్తున్నారు.

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కి మరమ్మత్తు చేసి సమస్యను పరిష్కరించండి

స్నేహిత హిల్స్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కి మరమ్మత్తు చేసి సమస్యను పరిష్కరించాలి. చాలాకాలంగా డ్రైనేజీ మురుగునీటితో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది జిహెచ్‌ఎంసి రాజేంద్రనగర్ సర్కిల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరించాలని స్నేహిత హిల్స్ కు చెందిన ప్రతాప్ రెడ్డి అధికారులకు విజ్ఞప్తి చేశారు.

ప్రతాప్ రెడ్డి స్నేహిత హిల్స్ 

మరిన్ని వార్తలు