నేడు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు
18-08-2026 02:08 AM
సంగారెడ్డి, ఆగస్టు 17: సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకుని ఈ నెల 18న సంగారెడ్డి కలెక్టరేట్ ఎదురుగా ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం వద్ద జయంతి వేడుకలను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా 18న ఉదయం 10:30 గంటలకు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పుష్పమాలలు వేసి నివాళులర్పించనున్నట్లు తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల ప్రతినిధులు, ప్రజలు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.






