ప్లాస్టిక్ నిర్మించిన సర్పంచ్ కు సన్మానం

25-09-2026 | 05:26pm

నిర్మల్ సెప్టెంబర్ 25 ( విజయ క్రాంతి) : నిర్మల్ జిల్లాలోని(Nirmal District) మొట్టమొదటిసారిగా చిట్యాల గ్రామంలో ప్లాస్టిక్ నిషేధం(Plastic Ban) విధించి పర్యావరణ పరిరక్షణ(Environmental Protection) కోసం స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేసిన గ్రామ సర్పంచ్ ఏనుగు సుప్రియ వెంకటరెడ్డిని(Village Sarpanch Enugu Supriya Venkatreddy) అధికారులు సన్మానం చేశారు. శుక్రవారం నిర్మల్ రూరల్ మండల ప్రజా పరిషత్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయా గ్రామాల సమస్యలపై సర్పంచులు అధికారులకు మొరపెట్టుకున్నారు. తమ ప్రమేయం లేకుండా ఇందిరమ్మ ఇల్లు(Indiramma House) ఇస్తున్నారని కొందరు సర్పంచులు అధికార తీరిపై మండిపడ్డారు. అనంతరం చిట్యాల సర్పంచునుసన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి సత్యనారాయణ ఎంపీడీవో అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు