శివాలయంలో సర్పంచ్ పద్మ శంకర్ ప్రత్యేక పూజలు
07-09-2026 | 01:54pm
బెజ్జూర్ సెప్టెంబర్ 7 {విజయక్రాంతి): బెజ్జూర్(Bejjur) మండల కేంద్రంలోని శివాలయంలో సిద్దాపూర్ సర్పంచ్(Siddhapur Sarpanch) చిందే పద్మ శంకర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాస చివరి సోమవారం కావడంతో తెల్లవారి జాము నుండి భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకొని శ్రీ రంగనాయక స్వామి, వీర హనుమాన్, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాలలో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. శివాలయంలో నిత్యభిషేకం కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు గురుదత్ ఆధ్వర్యంలో అభిషేకం అర్చన ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆలయాలలో భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ జిల్లాల సుధాకర్ గౌడ్ దంపతులు, ఉపేంద్ర చారి నరేష్ దంపతులు, నాగుల రవి దంపతులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
