జనగామలో ఉద్రిక్తత - కార్యకర్తల అరెస్ట్
07-09-2026 | 03:27pm
జనగామ, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను లోపలికి పంపడం లేదని ఆరోపిస్తూ జనగామ(Jangaon) జిల్లా కేంద్రంలో కార్యకర్తలు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిరసన తెలుపుతున్న కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.
