అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న సర్పంచ్, అంగన్వాడీ టీచర్లు అరెస్ట్

09-09-2026 | 09:30am

బాన్సువాడ, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): ప్రభుత్వ వైఫల్యలు, అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలంటూ బుధవారం చలో అసెంబ్లీ(Chalo Assembly) ముట్టడి కార్యక్రమాన్నికి తరలి వెళ్తున్న కామారెడ్డి జిల్లా(Kamareddy District) బీర్కూర్ బిఆర్ఎస్ సర్పంచ్ ధర్మ తేజ, అంగన్వాడి టీచర్ లను(Anganwadi teachers ) పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా సర్పంచ్(Sarpanch) ధర్మ తేజ మాట్లాడుతూ రాత్రికి రాత్రే పోలీసులు ఇంటి వద్దకు వచ్చి ముందస్తు అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు.

ప్రభుత్వ నిర్లక్షనికి వైఖరి అని చెప్పుకోవచ్చన్నారు. అంగన్వాడి టీచర్లు ఆడవాళ్ళని చూడకుండా రాత్రికి రాత్రే అరెస్ట్ చేయడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీలతో కలిసి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండ కడతామని అంగన్వాడి టీచర్ల డిమాండ్లను పరిష్కరించేంతవరకు పోరాడుతూనే ఉంటామని ఆయన హెచ్చరించారు. అరెస్ట్ అయిన వారిలో నాగమణి,సవిత , సరిత తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు