19 August, 2026 | 4:32 AM

ఘనంగా సర్వాయి పాపన్న జయంతి

19-08-2026 12:30 AM

గణపురం, ఆగస్టు 18 (విజయక్రాంతి):  బహుజనుల చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని గణపురంలో ఘనంగా నిర్వహించారు.  కల్లుగీత సహకార సంఘం ఆవరణలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మార్క మొగిలి గౌడ్ అధ్యక్షతన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో జా తీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బత్తిని శివశంకర్ గౌడ్  అరెళ్లి కుమార్ గౌడ్ ఉపాధ్యక్షులు గుర్రం సదానందం  గౌడ్ కారోబార్  మాజీ సొసైటీ అధ్యక్షులు ఆరెల్లి  రాజు గౌడ్ బూర రాజగోపాల్ గౌడ్ గౌడ సంఘం సీనియర్ నాయకులు నాయకపు నరసింహ రాములు గౌడ్ మాదాసు అర్జున్ గౌడ్ మార్క శ్రీనివాస్ గౌడ్ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.