మూడో రోజూ నష్టాలే..క్రూడ్ మంటలకు మార్కెట్లు విలవిల
09-09-2026 | 05:56pm
ముంబై: అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు(Domestic stock markets) బుధవారం భారీగా నష్టపోయాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరువ కావడం, ఐటీ, రియల్టీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి సూచీలను దెబ్బతీసింది. సెన్సెక్స్ 813.35 పాయింట్లు నష్టపోయి 74,764.23 వద్ద, నిఫ్టీ 203.60 పాయింట్లు పడిపోయి 23,431.50 వద్ద ముగిశాయి. వరుసగా మూడో రోజు మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. క్రూడ్ ధరల పెరుగుదలతో దిగుమతి బిల్లు, ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలపై ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు.