మార్కెట్లకు బిగ్ షాక్

24-09-2026 | 05:14pm

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. బలహీనమైన గ్లోబల్ సంకేతాలతో పాటు ఐఆర్డీఏఐ ప్రతిపాదనలు మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి. దీంతో సెన్సెక్స్ 1,248 పాయింట్లు కోల్పోయి 73,581 వద్ద, నిఫ్టీ 384 పాయింట్లు పడిపోయి 23,063 వద్ద ముగిశాయి. నిఫ్టీలోని 50 షేర్లలో 48 నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్ స్టాక్స్‌లో భారీ అమ్మకాలు కనిపించాయి. పిబి ఫిన్‌టెక్ 35% పతనమవగా, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, బజాజ్ ఫిన్‌సర్వ్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు కూడా గణనీయంగా నష్టపోయాయి. మొత్తంగా ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్ రంగాలు భారీ మార్కెట్ విలువను కోల్పోయాయి.


మరిన్ని వార్తలు