ఏడుపాయల్లో చలువ పందిళ్లు ఏర్పాటు..

02-10-2026 | 06:18pm

*విజయక్రాంతి దినపత్రిక కథనానికి స్పందన 

పాపన్నపేట, అక్టోబర్02: దేశంలోనే రెండో వనదుర్గా మాత ఆలయంగా.. జనమేజయుని సర్పయాగస్థలిగా వినతికెక్కిన రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గా మాత సన్నిధి(Edupayala Vanadurga Mata Temple)లో భక్తులకు నిలువ నీడ కల్పించేందుకు ఎట్టకేలకు చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. బుధవారం 'విజయక్రాంతి' దినపత్రికలో ఏడుపాయల్లో వనదుర్గమ్మ దర్శనానికి వెళ్లే క్యూలైన్లో చలువ పందిళ్లు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారనే కథనం ప్రచురితమైన సంగతి విధితమే. ఇట్టి కథనానికి అధికారులు స్పందించి భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇట్టి విషయానికి విజయక్రాంతి దినపత్రికకు భక్తులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

మరిన్ని వార్తలు