ఎల్లారెడ్డి ఇరిగేషన్‌ ఈఈగా షేర్ల వెంకటేశ్వర్లు

10-09-2026 | 11:14pm

నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) ఎల్లారెడ్డి ఇరిగేషన్ డివిజన్ నెంబర్ 4 ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్గా షేర్ల వెంకటేశ్వర్లు గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో డిప్యూటీ ఇంజనీరింగ్గా పనిచేసిన అనుభవంతో పోచారం ప్రాజెక్టు(Pocharam Project) వరద తాకిడి సమయంలో తీసుకున్న నిర్ణయాలు ప్రశంసలు అందుకున్నాయి. ఈ నేపధ్యంలో షేర్ల వెంకటేశ్వర్లు ఎల్లారెడ్డి ఈఈగా(EE of Yellareddy Irrigation) బాధ్యతలు చేపట్టడంతో పలువురు అభినందనలు తెలియజేశారు. డివిజన్ పరిధిలోని ప్రాజెక్టులు కాలువలు,సాగునీటి వనరుల నిర్వహణపై అధికారులతో చర్చించారు.ఖరీఫ్ సమయంలో రైతులకు సాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పని చేయాలని అధికారులకు సూచించారు.

మరిన్ని వార్తలు