కంగ్టి, శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయ హుండీ లెక్కింపు

03-10-2026 | 08:19pm

రూ.1.15 లక్షల ఆదాయం

కంగ్టి,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయ(Siddheshwara Swamy Temple) హుండీని శనివారం లెక్కించారు.దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ రంగారావు,ఆలయ ఈఓ శివరుద్రప్ప పర్యవేక్షణలో హుండీ లెక్కింపు(Hundi Collection) నిర్వహించారు. గత కొన్ని నెలలుగా భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా రూ.1,15,947 ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. హుండీ లెక్కింపు ప్రక్రియలో ఆలయ సిబ్బంది సంగమేశ్వర్,అర్చకులు జయకృష్ణతో పాటు పలువురు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు