20 వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలు

05-10-2026 | 08:54pm

- సీపీ రష్మీ పెరుమాళ్            

సిద్దిపేట క్రైం, అక్టోబర్ 5 (విజయక్రాంతి): ఈ నెల 5 నుంచి 20 వరకు సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని సీపీ రష్మీ పెరుమాళ్(Police Commissioner Rashmi Perumal) తెలిపారు. కమిషనరేట్  పరిధిలో ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాల నిర్వహణకు ముందస్తు అనుమతి పొందాలని సూచించారు.

వివిధ కారణాల పేరిట బలవంతంగా విద్యాసంస్థలు, కార్యాలయాలను మూసి వేయాలని ఒత్తిడి, బెదిరింపులకు గురిచేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీజే సౌండ్ వినియోగంపై నిషేధాజ్ఞలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.

మరిన్ని వార్తలు