‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్..
విజయ్ తనయుడు జేసన్ సంజయ్ ‘సిగ్మా’కు మెగాస్టార్ చిరంజీవి..
తమిళ స్టార్ విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘సిగ్మా’. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో సెప్టెంబర్ 25న జరగనున్న ఈ ఈవెంట్‌తో ‘సిగ్మా’ ప్రమోషన్స్ మరింత ఊపందుకోనున్నాయి. జేసన్ సంజయ్ తొలి దర్శకత్వ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సినిమాలో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లాతో పాటు పలువురు కీలక నటులు కనిపించనున్నారు.
లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. హీస్ట్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ‘సిగ్మా’ అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.