రోడ్డు ప్రమాదంలో సింగరేణి కార్మికుడికి తీవ్ర గాయాలు
17-09-2026 | 09:05pm
రామగిరి,(విజయక్రాంతి): రామగిరి మండలం(Ramagiri Mandal)లోని పన్నూరు యూనియన్ బ్యాంకు సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం(road accident) చోటుచేసుకుంది. బైక్ అదుపుతప్పి పడిపోవడంతో సింగరేణి కార్మికుడు(Singareni worker) తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన వ్యక్తిని పుల్లెల శంకరయ్య అలియాస్ జక్కుల శంకరయ్యగా గుర్తించినట్లు సమాచారం. ఆయన సబ్బితం గ్రామానికి చెందిన వ్యక్తిగా స్థానికులు తెలిపారు. ప్రమాదంలో తీవ్ర గాయాలైన శంకరయ్యను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.