6 September, 2026 | 1:21 AM

పారదర్శకంగా ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చేపట్టాలి

05-09-2026 | 11:59pm

అర్హత కలిగిన ప్రతి ఓటరు ఓటర్ల జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలి

అదనపు స్థానిక సంస్థల కలెక్టర్ ఎన్.వై. గిరి

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి పట్టణంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (Special Intensive Revision-2026) కార్యక్రమాన్ని నిబంధనల ప్రకారం పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి(Additional Collector N.Y. Giri) అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. శనివారం కామారెడ్డి మున్సిపల్(Kamareddy Municipal) పరిధిలోని పోలింగ్ కేంద్రం నంబర్ 262 పరిధిలో నిర్వహించిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ నిర్వహణ తీరును పరిశీలించి, అర్హత కలిగిన ప్రతి ఓటరు ఓటర్ల జాబితాలో నమోదయ్యేలా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ఓటర్ల వివరాల్లో అవసరమైన సవరణలు, మార్పులు, చేర్పులు, తొలగింపులు తదితర ప్రక్రియలను ఎన్నికల నిబంధనల మేరకు చేపట్టాలని తెలిపారు. ఓటర్ల నుంచి అందే దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి, ఎలాంటి లోపాలకు తావులేకుండా పారదర్శకంగా ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించి, అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ తమ పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో పరిశీలించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ రవి తేజ, మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ టి. పర్వతాలు, సూపర్‌వైజర్ అధికారులు, వార్డు అధికారులు, బూత్ స్థాయి అధికారులు, బి ఎల్ ఓ లు, వార్డు ప్రజలు ,తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు