మంథనిలో ఉధృతంగా కొనసాగుతున్న సర్ సర్వే
ఓటర్ల ఇంటి వద్దకే వెళ్లి వివరాల సేకరణ
ఈ నెల 15తో ముగియనున్న ప్రక్రియ
మంథని,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్ సర్వే కార్యక్రమం(SIR Survey Program) మంథని మండలం(Manthani Mandala)లో ఉధృతంగా కొనసాగుతోంది. ఈ నెల 15వ తేదీతో సర్వేకు తుది గడువు ముగియనున్న నేపథ్యంలో అధికారులు, సిబ్బంది వేగం పెంచారు. ఓటర్ల జాబితాలో పేరులో, ఇంటి పేరులో, తండ్రి పేరులో లేదా ఇతర వివరాల్లో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే వాటిని సరిచేసుకునేందుకు చర్యలు చేపడుతున్నారు.
సర్వే సిబ్బంది నేరుగా ఓటర్ల ఇళ్ల వద్దకు వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలను సేకరిస్తున్నారు. ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎన్నికల కమిషన్ జారీ చేసిన నియమ నిబంధనలకు అనుగుణంగా సమాచారాన్ని నమోదు చేస్తున్నారు. ఈ సందర్భంగా మిట్ట సుజాత మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనలను పూర్తిగా పాటిస్తూ ఖచ్చితమైన వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులు, పొరపాట్లు లేకుండా సర్వే నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సర్వేకు మంథని మండలంలోని ఓటర్లు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆమె తెలిపారు. ఈ నెల 15వ తేదీ లోపు ఓటర్లు తమ వివరాలను పరిశీలించుకుని, ఏవైనా తప్పులు ఉంటే సరిచేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.