ట్రక్-పికప్ ఢీ.. భారీ విషాదం
25-09-2026 | 06:36pm
బలోద్: ఛత్తీస్‌గఢ్‌లోని బలోద్ జిల్లా(Balod District)లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధమతరి-కంకేర్ మధ్య NH-30పై మార్కటోలా ఘాట్(Markatola Ghat) సమీపంలో వరి ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రక్కు, డీజే సిస్టమ్‌తో వెళ్తున్న పికప్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి అక్కడికక్కడే చెందగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పురూర్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు, వాహనాల వేగం తదితర అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.