కిట్స్ కళాశాలలో టాస్క్ ఆధ్వర్యంలో నైపుణ్యాబివృద్ధిపై శిక్షణ
కోదాడ,(విజయక్రాంతి): కోదాడలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల(KITS Women's Engineering College)లో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జి(Telangana Academy for Skill and Knowledge) ఆధ్వర్యంలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ,నాలుగవ సంవత్సరం చదువు తున్న విద్యార్థినులకు, టాస్క్ నిపుణులు బి సాయిబాబా ఆధ్వర్యంలో ఏఐ కెరీర్స్ ఫర్ ఉమెన్ ట్రైనింగ్ మీద మంగళవారం శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగినది. ఈ శిక్షణ తరగతులలో విద్యార్థి నులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ రంగంలో అద్భుతమైన కెరీర్ అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో ఏఐ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న విభాగం. మహిళల ప్రాతినిధ్యాన్ని ఈ రంగంలో పెంచేందుకు ప్రభుత్వాలు ప్రముఖ సంస్థలు ప్రత్యేక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నాయి పేరు మీద విద్యార్థి నులకు ఎఐ ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఈ శిక్షణ తరగతులు పనేండు రోజుల పాటు జరుగుతాయి అని తెలిపారు ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళపల్లి గాంధీ మాట్లాడుతూ , భారతదేశంలో మహిళల కోసం కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ, మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో ప్రత్యేకంగా ఏఐ పై ఉచిత శిక్షణా కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది అన్నారు.