26 August, 2026 | 3:08 AM

కిట్స్ కళాశాలలో టాస్క్ ఆధ్వర్యంలో నైపుణ్యాబివృద్ధిపై శిక్షణ

26-08-2026 12:00 AM

కోదాడ ఆగస్టు 25: కోదాడ లోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల లో తెలంగాణ అకాడ మీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జి ఆధ్వర్యంలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ , మూడవ సంవత్సరం చదువు తున్న విద్యార్థినులకు, టాస్క్ నిపుణులు అభిషేక్  ఆధ్వర్యంలో ఆర్టిఫిషల్ అండ్ లైఫ్ స్కిల్స్ పై మంగళవారం శిక్షణ తరగతులు నిర్వహించారు.

ఈ శిక్షణ తరగతులలో విద్యార్థి నులకు ఆర్టిఫిషల్ అండ్ లైఫ్ స్కిల్స్ మీద విద్యార్థి నులకు అవగాహనా కల్పించారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళపల్లి గాంధీ మాట్లాడుతూ, నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థినులు వివిధ నైపుణ్యాలను పెంపొందించుకున్నప్పుడు మాత్రమే ఉన్నత ఉపాధి అవకాశాలు అందుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమం లో విబాగాదిపతి స్రవంతి, అధ్యాపకులు, విద్యార్థి నులు పాల్గొన్నారు.