6 September, 2026 | 10:30 AM

అత్యవసర వైద్య సేవలకు స్మార్ట్ అంబులెన్స్‌లు

06-09-2026 | 05:10am
  1. రెండు అధునాతన లైఫ్ సపోర్ట్ వాహనాల ఏర్పాటు
  2. జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్స్‌లో ప్రారంభం

హైదరాబాద్, సెప్టెంబరు 5(విజయక్రాం తి): అత్యవసర వైద్య సేవల(Emergency medical services)ను మరింత వేగవంతం చేయడంలో భాగంగా జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రి(Apollo Hospital)లో 5జీ సాంకేతికతతో పనిచేసే స్మార్ట్ అంబులెన్స్(smart ambulances) సేవలను, రెండు అధునాతన లైఫ్ సపోర్ట్ స్మార్ట్ అంబులెన్సులను బిలియన్ హారట్స్ బీటింగ్ ఫౌండేషన్(Billion Hearts Beating Foundation) (బీహెచ్బీ), అపోలో హాస్పిటల్స్, మార్ష్ ఇం డియా(Marsh India) సంయుక్తంగా చేపట్టిన కార్యక్రమం లో భాగంగా  జూబ్లీహిల్స్‌లోని అపోలో హా స్పిటల్స్‌లో శనివారం ప్రారంబించారు. మా ర్ష్ ఇండియా సీఎస్‌ఆర్ కార్యక్రమం ద్వారా ఈ ప్రాజెక్టుకు సహకారం అందిస్తోంది.

బీ హెచ్బీ అమలు భాగస్వామిగా వ్యవహరిస్తుండగా, అపోలో హాస్పిటల్స్ వైద్య, అత్యవసర చికిత్సా నైపుణ్యాన్ని అందిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్, తెలంగాణలో నిర్వహించిన ప్రత్యేక వైద్య శిబిరాల్లో ఈ అంబులెన్సులను వినియోగిస్తున్నారు. అపోలో హాస్పిటల్స్ తెలుగు రాష్ట్రాల సీఈఓ తేజస్వి రావు వీరేపల్లి మాట్లాడుతూ ప్రమాదం లేదా అత్యవ సర పరిస్థితి ఏర్పడిన తొలి నిమిషాల్లోనే వే గంగా వైద్యం అందించేందుకు ఈ అంబులెన్సులు దోహదపడతాయన్నారు.

బీహెచ్బీ సీఎస్‌ఆర్ ఆపరేషన్స్ హెడ్ సుధా ఝిజారియా మాట్లాడుతూ ఆసుపత్రులకే పరిమిత మైన వైద్య సేవలను ప్రజల వద్దకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. మార్ష్ ఇండియా ప్రెసిడెంట్, సీఈఓ సంజయ్ కేడియా మా ట్లాడుతూ అత్యవసర సమయంలో వేగవంతమైన వైద్య సహాయం అందించేందుకు ఈ భాగస్వామ్యం ఉపయోగపడుతుందన్నారు.

జూబ్లీహిల్స్ అపోలో ఎమర్జెన్సీ విభాగం అధిపతి డాక్టర్ పి. సౌజన్య మాట్లాడుతూ ఈ అంబులెన్సులు మొబైల్ ఐసీయూలుగా పనిచేస్తాయని, అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి చేరుకునేలోపే కీలక చికిత్స అందిం చేందుకు వీలుంటుందని తెలిపారు. కార్యక్రమంలో జే. రామ్‌చంద్ర, డాక్టర్ రవి కిరణ్, డాక్టర్ సుబ్బారెడ్డి హెడ్ అఫ్ ది డిపార్ట్‌మెంట్ అఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సతీష్ కుమార్ రెడ్డి, ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు