స్మార్ట్ రేషన్ కార్డుల ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే

11-09-2026 | 11:40pm

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మధుకర్ రెడ్డి

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): అర్హులైన ప్రతి ఒక్కరికి స్మార్ట్ రేషన్ కార్డులు(Smart ration cards) అందించడం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గణతేనని కాంగ్రెస్ పార్టీ(Congress government) మండల అధ్యక్షుడు గుడిపల్లి మధుకర్ రెడ్డి అన్నారు.తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు(MLA Mandula Samelu) ఆదేశానుసారం శుక్రవారం మండల పరిధిలోని సూర్యానాయక్ తండా గ్రామంలో సర్పంచ్ లూనావత్ కృష్ణనాయక్ ఆధ్వర్యంలో గ్రామంలోని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పేదలకు రేషన్ కార్డులు ఇవ్వలేదని,కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధిదారుల పూర్తి వివరాలుతో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను అందిస్తుందని అన్నారు.

మరిన్ని వార్తలు