విద్యుత్ సమస్యకు పరిష్కారం..

27-09-2026 | 08:05pm

నిజాంసాగర్ సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) నిజాంసాగర్ మండలంలోని నర్సింగ్ రావు పల్లి గ్రామంలోనీ 8వ వార్డులో విద్యుత్ సమస్య ఏర్పడడంతో గ్రామ సర్పంచ్ ప్రత్యేక చొరవ తీసుకొని  విద్యుత్ శాఖ అధికారుల సహకారంతో విద్యుత్ స్తంభాలను మార్చి విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చేశారు. తక్షణమే స్పందించి సమస్య తీర్చిన గ్రామపంచాయతీ పాలకవర్గానికి, విద్యుత్ శాఖ అధికారులకు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు