ప్రజలకు నాణ్యమైన, పారదర్శకమైన సేవలు అందించాలి

09-09-2026 | 07:26pm

టేకుమట్ల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

టేకుమట్ల,(విజయక్రాంతి): ప్రజలకు నాణ్యమైన, పారదర్శకమైన సేవలు అందించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్(SP Sirisetti Sankeerth) అన్నారు. జిల్లాలో పోలీసు సేవలను మరింత సమర్థవంతంగా అందించే లక్ష్యంతో ఎస్పీ బుధవారం టేకుమట్ల పోలీస్ స్టేషన్‌(Tekumatla Police Station)ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, సీసీ కెమెరాల పనితీరు, స్టేషన్ పరిసరాల పరిశుభ్రతను క్షుణ్ణంగా పరిశీలించారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అనంతరం పోలీసు సిబ్బందితో సమావేశమై శాంతిభద్రతల పరిరక్షణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, నేరాల నియంత్రణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు