బాల గణపయ్యకు ప్రత్యేక పూజలు

19-09-2026 | 12:45pm

బాల గణపయ్య స్వామిని దర్శించుకున్న సర్పంచ్ హీరాలాల్-సుమ దంపతులు

సింగరేణి, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): భాగ్యనగర్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని సామ్యతండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి(Sri Prasannanjaneya Swamy) దేవస్థానంలో శనివారం ప్రత్యేక పూజాకార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అనంతరం దేవస్థానం ప్రాంగణంలో కొలువుదీరిన బాల గణపయ్య( Bala Ganapayya) స్వామిని భాగ్యనగర్ తండా సర్పంచ్ బానోత్ హీరాలాల్, ఆయన సతీమణి సునా దర్శించుకుని స్వామివారికి నైవేద్యం సమర్పించారు. గణనాథుని ఆశీస్సులు తీసుకుని గ్రామ ప్రజలంతా సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు