ఇరిగేషన్ అధికారులపై రఘునందన్ సీరియస్
రామచంద్రపురం, ఆగస్టు 19: రామచంద్రపురం మండలం బిహెచ్ఈఎల్ ఎక్స్‌రోడ్(BHEL X-Road) నుండి బంధంకొమ్ము,అమీన్శపూర్ వెళ్లే రహదారి బ్రిడ్జి నిర్మాణ పనులను మెదక్ పార్లమెంట్ సభ్యులు యం.రఘునందన్ రావు పరిశీలించారు.వినాయక్ నగర్,జ్యోతినగర్ కాలనీలల్లో బస్టాప్,డ్రైనేజీ లైన్లు,పెండింగులో ఉన్న సమస్యలపై సియంసి కమీషనర్,అధికారులతో కలిసి ఎంపీ రఘునందన్ పర్యటించారు.
ఈ సందర్భంగా రఘునందన్ అమీన్ పూర్లో ఇరిగేషన్ అధికారులపై ఫైరయ్యారు.బఫర్ జోన్,ఎఫ్.టి.ఎల్ పేరుతో రోడ్ల విస్తరణకు ఇరిగేషన్ అధికారులు అడ్డం పడుతున్నారని అన్నారు.చెరువుల్లో పెద్ద పెద్ద భవనాలు కడుతుంటే ఇరిగేషన్ అధికారులకు కనిపించదు కానీ అమీన్పూర్లో బంధంకొమ్ము చెరువు వద్ద 150ఫీట్ల రోడ్డుకు ఎందుకు అనుమతి ఇవ్వరని ప్రశ్నించారు.వారం రోజుల్లో బంధంకొమ్ము చెరువు వద్ద 150ఫీట్ల రోడ్డుకి అనుమతి ఇవ్వకపోతే ఇరిగేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమములో రామచంద్రపురం డివిజన్ అధ్యక్షులు నర్సింగ్ గౌడ్,కృష్ణ మూర్తి చారి ,ఈర్ల రాజు బిజెపి నాయకులు, స్థానికులు తాడితరులు పాల్గొన్నారు.