కల్లూరులో కొండముచ్చుల కలకలం
27-09-2026 | 11:14am
రెండు రోజుల్లో నలుగురికి గాయాలు
వరుస దాడులతో ప్రజల్లో భయాందోళనలు
కల్లూరు,సెప్టెంబర్ 26 (విజయ క్రాంతి): పట్టణంలో కొండముచ్చులు, కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. షాపులో పనిచేస్తున్న ఎలక్ట్రిషియన్(Electrician) ఖమ్మంపాటి క్రాంతిపై కొండముచ్చు దాడి చేయడంతో చేతికి తీవ్ర గాయాలయ్యాయి. రెండు రోజుల వ్యవధిలో నలుగురు కొండముచ్చుల(Baboons) దాడుల్లో గాయపడి చికిత్స పొందుతున్నట్లు స్థానికులు తెలిపారు.రహదారులపైకి వచ్చి వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తుండటంతో ప్రమాదాలు జరిగే పరిస్థితి నెలకొంది.వరుస ఘటనల నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి కొండముచ్చుల బెడదను నియంత్రించి ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించాలని పట్టణవాసులు కోరుతున్నారు.