6 September, 2026 | 12:20 AM

కాంగ్రెస్ పాలనలో విద్యార్థులు యువతకు తీవ్ర అన్యాయం

05-09-2026 | 10:53pm

మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

కామారెడ్డి,(విజయక్రాంతి): కాంగ్రెస్ పాలనలో విద్యార్థులు(Students) యువతకు తీవ్ర అన్యాయం జరిగిందని మాజీ ప్రభుత్వ గంప గోవర్ధన్(Former government Gampa Govardhan) అన్నారు. శనివారం కామారెడ్డి నిజాం సాగర్ చౌరస్తాలో విద్యార్థులు, యువతతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్(Fee reimbursement) 11,000 వేలకోట్లు విడుదల చేయాలన్నారు. ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిజాం సాగర్ చౌరస్తా నుంచి మున్సిపల్ కార్యాలయం(Municipal Office) వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దిన్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కాసర్ల గోదావరి, స్వామి, మున్సిపల్ కౌన్సిలర్లు, బిఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెరవేర్చాలని అన్నారు.

మరిన్ని వార్తలు