సబ్జెక్టు పై పరిజ్ఞానం పొందాలి: ప్రొఫెసర్ డా.పులి రమాదేవి
11-09-2026 | 10:21pm
దామరచర్ల : విద్యార్థి దశ నుండి ప్రతి ఒక్కరు ఆసక్తితో చదువుతూ వివిధ సబ్జెక్టులపై పరిజ్ఞానం పొందాలని అదే విధంగా తమకు నచ్చిన సబ్జెక్ట్ ల ఉపాధి అవకాశాలను తెలుసుకోవాలని అసోసియేట్ ప్రొఫెసర్ డా.పులి రమాదేవి అన్నారు. మండలం లోని బొత్తలపాలెం ఆదర్శ పాఠశాలలో శుక్రవారం విద్యార్థిని, విద్యార్థులకు వాణిజ్యం - ఉపొంది అవకాశాలు అనే అంశంపై అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సమయాన్ని వృధా చేయకుండా ప్రపంచికరణలో మార్పులకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకొని ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే వారిగా ఎదగాలని తెలియజేశారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ పోతురాజు నరహరి మాట్లాడుతూ, ఆంగ్ల భాషలో నైపుణ్యాలను పెంపొందించుకొవాలని, ఆంగ్లభాష పరిజ్ఞానంలో మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందవచ్చని పేర్కొన్నారు.