పాక్‌లో ఆత్మాహుతి దాడి

19-09-2026 | 05:30am
  1. మసీద్‌ను ఢీకొట్టిన బాంబుల వాహనం
  2.    21 మంది మృతి.. ఆరుగురు ఉగ్రవాదులు హతం
  3. మృతుల్లో 16 మంది పోలీసులు, ఐదుగురు పౌరులు, 
  4. మరో 78 మందికి గాయాలు

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 18: పాకిస్థాన్‌(Pakistan)లోని వాయువ్య ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా రాష్ట్రం(Northwestern Khyber Pakhtunkhwa province)లోని కోహట్ జిల్లాలోని ఒక మసీదును బాంబులతో నిండిన వాహనంతో ఓ దుండగుడు ఢీకొట్టడంతో భారీ పేలుడు సంభవించింది. సాయుధ మిలిటెంట్ల(armed militants)తో కాల్పులతో ఆ ప్రాంతం దద్దరిల్లిం ది. ప్రార్థనల సమయంలో జరిగిన ఈ దాడిలో 21 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో 16 మంది పోలీసులు, ఐదుగురు పౌరులు ఉన్నారు. మరో 78 మంది గాయపడ్డారు. ఆరుగురు ఉగ్రవాదులు కూడా హతమయ్యారు.

రాష్ట్ర రాజధాని పెషావర్‌(Peshawar)కు నైరుతి దిశలో సుమారు 60 కిలోమీటర్ల దూరంలో, కోహట్‌లోని పాత పోలీస్ లైన్స్(Police Lines) సమీపంలో ఉన్న మసీదు(Mosque)లో ఈ పేలుడు సంభవించింది. పాకిస్తాన్ లోని ఖైబర్ పఖ్తూన్‌క్వా రాష్ట్రం(Khyber Pakhtunkhwa province)లోని కోహట్ జిల్లాలో శుక్రవారం ప్రార్థనల సమయంలో ఒక మసీదు బయట పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 16 మంది మృతిచెందగా, 50 మందికిపైగా గాయపడినట్లు, మృతుల్లో ఐదుగురు పోలీసులు, 11 మంది పౌరులున్నారని ఖైబర్ ఫంఖ్తూన్‌క్వా ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) జుల్ఫికర్ హమీద్ తెలిపారు.

ఇత్తెహాద్-ఉల్-ముజాహిదీన్ పాకిస్థాన్ అనే పెద్దగా తెలి యని ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యత వహించింది. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జుల్ఫికర్ హమీద్ మాట్లాడుతూ, ఏడుగురు సాయుధ ఉగ్రవాదులు పోలీస్ లైన్స్‌లోకి ప్రవేశించారు. పేలుడు పదార్థాలతో నిండిన వాహనం పాత పోలీస్ లైన్స్ గేటును ఢీకొట్టడంతో, పేలుడు సంభవించింది. ఆ తర్వాత భీకర కాల్పుల సమయంలోనే స్పెషల్ బ్రాంచ్ భవనం వద్ద మరో ఆత్మాహుతి దాడి జరిగిందని తెలిపారు. 

మరిన్ని వార్తలు